Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Siluvalo Saagindhi Yaatra

సిలువలో సాగింది యాత్ర

Siluvalo Saagindhi Yaatra

Lyricist: Traditional Telugu Christian Worship Song
Chorus
సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని దయగల పాత్ర‖ 2x ‖
ఇది ఎవరి కోసమో
ఈ జగతి కోసమే
ఈ జనుల కోసమే‖ సిలువలో ‖
Verse
పాలు కారు దేహము పైన
పాపాత్ముల కొరడాలెన్నో‖ 2x ‖
నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి‖ 2x ‖
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ‖ 2x ఇది ఎవరి ‖
Verse
చెళ్ళుమని కొట్టింది ఒకరు
తన మోముపైన ఉమ్మింది మరియొకరు‖ 2x ‖
బంతులాడినారు, బాధలను పెట్టినారు‖ 2x ‖
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ‖ 2x ఇది ఎవరి ‖
Verse
వెనుక నుండి తన్నింది ఒకరు
తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు‖ 2x ‖
గేలి చేసినారు పరిహాసమాడినారు‖ 2x ‖
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ‖ 2x ఇది ఎవరి ‖

Related Tags

PraiseWorshipGood Friday