Chorus
సిలువలో వ్రేలాడు ప్రభువే విలువ కందఁగ రాని యీవుల నెలమి
మనకై కొనియెఁగల్వరి నిపుడు సాష్టాంగము లొనర్చుచు‖ సిలువ ‖
Verse
కొరత చావయినను మరణము వఱకుఁదనుఁ దగ్గించుకొని మన కొఱకు
దాసుండగుచు రిక్తుని కరణి నిట జీవము నొసంగెడు‖ సిలువ ‖
Verse
తనను నమ్మినవారు చావక యనిశ జీవమునొంది బతుకను దన
స్వపుత్రుని నిచ్చునంతఁగఁ దండ్రి ప్రేమించెను జగంబును‖ సిలువ ‖
Verse
పాప మెఱుగని వాని మనకై పాపముఁగ నొనరించి దేవుఁడు
శాపగ్రస్తులలోన నొకఁడుగ మా ప్రభుండెంచంగఁ బడియెను‖ సిలువ ‖
Verse
లోకమాంస పిశాచులని యెడి భీకారుల పొంగుఁ గృంగను శ్రీ కరుఁ
డు మన దేవతనయుం డౌ కృపానిధి దీనుడయ్యెను‖ సిలువ ‖
Verse
ఘోరయుద్ధముఁ జేసివైరిని గూలఁద్రోసిన తావిదే మన పారమార్ధిక
బలము కిరువగు ధీర శ్రేష్ఠుఁడు దిశలు ఘళ్లన
దేశ మిత్తు నని శ్రీకరుం డెహోవా సెలవిచ్చెను‖ దశమ ‖
Verse
శరణు గలదిఁక పాపకోటికి స్వామి ద్రోహపు శత్రులకు సహ కరుణ
రుధిర కణాగతంబున కలుష రహిత మనంత రక్షణ‖ సిలువ ‖
Verse
మాకు ప్రేమ సారమయ్యెను మాకు జీవనాధారమయ్యెను మాకుఁ
దృప్తి సునీరమయ్యెను మాకుఁ బరమ విచారమయ్యెను‖ సిలువ ‖
Verse
నమ్ముదము సైన్యముల ప్రభువును చిమ్ముదము సందియము లాత్మను
క్రమ్ముదము మోక్షపురి బాట సు ఖమ్ము మన హృదయమ్ము లొందను‖ సిలువ ‖