Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Siluvanu Mosi Eelokamunu Thalakrindulu Cheyu Tharunamidhae

సిలువను మోసి ఈలోకమును తలక్రిందులు చేయు తరుణమిదే

Siluvanu Mosi Eelokamunu Thalakrindulu Cheyu Tharunamidhae

Verse
పల్లవి: సిలువను మోసి ఈలోకమును
తలక్రిందులు చేయు తరుణమిదే
Verse
లేలెమ్ము సోదరుడా నిద్రనుండి
ప్రకటింపను యేసు నామమును
సోమరి యేల నిద్రించెదవు
ఈ ధరను లేపెడు సమయమిదే
Verse
పరిశుద్ధాత్మ కవచము తోడిగి
నీనడుము కట్టి తయ్యారగుమా
సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి
సువార్తను చాటెడు సమయమిదే
Verse
లోకరక్షణకై ప్రభు యేసు
వీకతో నరుదెంచెను ఈ ధరకు
వెలుగును మనకు నిచ్చెను యేసు
తన స్తుతులను పాడెడు సమయమిదే
Verse
పాతాళమునకు కొనిపోయెడి నీ
పాప నిద్రను విడనాడు మిక
సిలువ మర్మము నెరుగు మిపుడే
కునికెడు సమయము కాదిది ప్రియుడా
Verse
రక్షింపబడుట కాశించినతో
పశ్చాతాప పడు మీదినమే
కలుషాత్ముండా తడవేలనికన్
కనుమా నీ తేర్పు సమయ మిదే

Related Tags

RepentanceEvangelismService