Chorus
సిలువను మోసితివా నా కొఱకై కలువరి మెట్టపైకి సిలువ నా
యాత్మలోఁ బలుమాఱు దలఁపఁగాఁ దాలిమి లేదాయెను హా యీ
జాలికి మారుగా నేనేమి సేయుదు ప్రేమను మరువఁజాల‖ సిలువ ‖
Verse
ఘోరమైనట్టి యీ భారమైన సిలువ ధరియించి భుజముపైని నా
దురితముల్ బాపను కరుణచేఁ జనుదెంచి మరణము నొందితివా‖ సిలువ ‖
Verse
కలువరి మెట్టపైఁ కాలు సేతు లెల్ల చీలలతోఁ గ్రుచ్చిపట్టి యా
సిలువకుఁ గొట్టఁగ విలువైన నీ మేని రక్తము ప్రవహించెనా‖ సిలువ ‖
Verse
మెట్టపైన నిన్నుఁ పెట్టిన బాధ నేఁ బట్టి తలంపఁగను ఆహా పట్టైన
నీ ప్రేమ నెట్టుల మఱతును కష్టముల్ గలిగినను‖ సిలువ ‖
Verse
పంచగాయములను నెంచి యాత్మలోన నుంచి తలంపఁగను హానా
మించిన దురితముల్ ద్రుంచి నన్నెంచిర క్షింపవచ్చెను భూమికి‖ సిలువ ‖