Verse
సిలువను మోస్తు సాగుతాం విప్లవ జ్వాలను రగిలిస్తాం‖ 2x ‖
యేసే మా ఊపిరని చాటుతాం భువినే దివిగా మార్చేస్తాం‖ 2x ‖
క్రీస్తు సైనికులం మేమువెలుగే చిరుదివ్వెలం మేము
సత్యాన్వేషకులం మేము నీతికి దాసులము మేము
Verse
సత్యం కోసం పోరాడుతాం క్రీస్తు మాటలను ప్రకటిస్తాం‖ 2x ‖
శ్రమ ఎదురైనా సహిస్తాం క్రీస్తుని పోలి నడుస్తాం‖ 2x ‖
Verse
ప్రజల కన్నీరు తుడుస్తాం మరణం వచ్చిన వెనుదిరుగం‖ 2x ‖
పరిశుద్ధతతో జీవిస్తాం యేసు ప్రేమను చూపిస్తాం‖ 2x ‖