Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Siluvanu Veedanu Siluvanu Veedanu Siluvanu Veedanu

సిలువను వీడను సిలువను వీడను సిలువను వీడను

Siluvanu Veedanu Siluvanu Veedanu Siluvanu Veedanu

Verse 1
Reference: క్రీస్తు విషయమైన నింద గొప్పభాగ్యమని యెంచుకొని ... హెబ్రీ. 11:26
Verse
నా యేసు మార్గమందున వెళ్ళ నాయత్తమా?
గొల్గొతాకొండ బాధలో - పాలు పొందెదవా?
Chorus
సిలువను వీడను - సిలువను వీడను
సిలువను వీడను సిలువను వీడను - సిలువను వీడను
సిలువను సిలువను వీడను
Verse
బంధుమిత్రుల మధ్యను శ్రమ సహింతువా?
మూర్ఖ కోపిష్టుల మధ్య దిట్టముగ నుందువా?
Verse
ఆకలి దాహ బాధలో ధైర్యంబుగ నిల్తువా?
అవమానము వచ్చినన్ - సిల్వను మోతువా?
Verse
పాపాత్ములు గుణపడన్ - దత్తము చేతువా?
భయస్థులు ధైర్యపడన్ - యుద్ధము చేతువా?
Verse
లోకులు నాశమైరిగా - వీరులు లేకయే
విమోచకుడు సిల్వలో - వ్రేలాడి మృతి పొందెను
Verse
జీవాంతరము వరకు - నిల్చిపోరుసల్పి
దైవకృపచే గెల్చి నే - మోక్షము చేరుదున్

Related Tags

CrossFaithfulnessPerseverance