Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Siluvapai Vraelaadu Shreeyaesudu

సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు

Siluvapai Vraelaadu Shreeyaesudu

Verse
సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు
నరులకై విలపించు నజరేయుడు
ఆ దేవుడు చిందించిన రుధిర దారలే
ఈ జగతిని విమోచించు జీవధారలు
Verse
నిరపరాధి మౌనభుని దీనుడాయెను
మాతృమూర్తి వేదననే ఓదార్చెను
అపవాది అహంకార మణచి వేసెను
పగవారి కొరకై ప్రభు ప్రార్ధించెను‖ సిలువ ‖
Verse
కలువరి గిరి కన్నీళ్ళతో కరిగిపోయెను
పాప జగతి పునాదులే కదలిపోయెను
లోక మంత చీకటి ఆవరించెను
శ్రీయేసుడు తలవాల్చి కన్నుమూసెను‖ సిలువ ‖

Related Tags

Good FridayJesusCrucifixion