Chorus
సిలువే నా శరణాయెను రా నీ సిలువే నా శర ణాయెను రా సిలువ
యందే ముక్తి బలముఁ జూచితి రా‖ నీ సిలువే ‖
Verse
సిలువను వ్రాలి యేసు పలికిన పలుకు లందు విలువలేని
ప్రేమామృతముఁ గ్రోలితి రా‖ నీ సిలువే ‖
Verse
సిలువను జూచుకొలఁది శిలసమానమైన మనసు నలిగి కరిగి నీరగు
చున్నది రా‖ నీ సిలువే ‖
Verse
సిలువను దరచి తరచితి విలువ కందఁగ రాని నీ కృప కలుష మెల్లనూ
బాపఁగఁ జాలును రా‖ నీ సిలువే ‖
Verse
పలు విధ పథము లరసి ఫలిత మేమి గానలేక సిలువయెదుటను
నిలచినాఁడను రా‖ నీ సిలువే ‖
Verse
శరణు యేసు శరణు శరణు శరణు శరణు నా ప్రభువా దురిత
దూరుఁడ నీ దరిఁ జేరితి రా‖ నీ సిలువే ‖