Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Siluve Nee Guriga Naduvu Yauvanuda

సిలువే నీ గురిగా నడువు యౌవనుడా

Siluve Nee Guriga Naduvu Yauvanuda

Verse
పల్లవి: సిలువే నీ గురిగా - నడువు యౌవనుడా
వెనుకంజ వేయకయే - నిలువు యేసు బండ పై
Verse
మునుగు చుండె - నీ జీవనావ దాటించు వారెవ్వరు?
యేసు ప్రభుండే - దాటించువాడు నీదు చుక్కాని యేసే
Verse
వచ్చెను యేసు - ఈ లోకమునకు తెచ్చె నీకు రక్షణ
అక్షయుడు తెరచె - నిశ్చయముగ మోక్షద్వారము నీకే
Verse
సిలువలో యేసు నీ పాపములకై రక్తము కార్చెను
విమోచించును విశ్వసించిన - ముక్తిని పొందెదవు
Verse
ప్రేమవార్త ప్రకటింప బడెను ప్రియులారా రండి నేడే
మీ ఉల్లములకు ప్రియమైన యేసే శాంతి నిచ్చెడి రాజు

Related Tags

SalvationCrossYouth