Verse
సిలువేకదా చింతసదామహా సిలువేకదా మనకమోఘము వెలలేని
యాత్మ సంభోగము విలసత్పరమ ద్రవ్యభాగ్యము గుణత్యాగము ననురాగము
మహా సిలువే‖ సిలువే ‖
Verse
సిలువ బోధకు చెవినొగ్గుమా చెలువముగొన నాత్మ నొగ్గుము వల్ల నొప్పు
నీకు సౌభాగ్యము ఆత్మారోగ్యము నంతో శ్లాఘ్యము సిలువే‖ సిలువే ‖
Verse
చంపెనిందు ప్రభుని కర్తను సంపాదించె నర విముక్తుని బెంపారు
నానందముసూక్తిని ననురక్తిని నిత్యముక్తిని మహా సిలువే‖ సిలువే ‖
Verse
పాపదావాగ్ని సంతుప్తులు స్వపుణ్యదుర్మద వ్యాప్తులు నీ పేరు నమ్మిన
దీప్తులు సుఖ ప్రాప్తులు సర్వ తృప్తులు మహా సిలువే‖ సిలువే ‖
Verse
రంగొప్ప దీని ప్రసంగము మంగళగీతసారంగము అంగీకార హృత్పద్మ
భృంగము రక్షశృంగము పాపభంగము మహా సిలువే‖ సిలువే ‖
Verse
భయములేదని చాటుచున్నది ప్రియయేసు వేడుకొమ్మన్నది దయ జూపు
నీ కనుచున్నది నిక్కమైనది చక్కనైనది మహా సిలువే‖ సిలువే ‖
Verse
చేరవచ్చిన వారి భారము ఘోరమైనను తద్విచారము ఆరూఢిపరమార్థ
సారము సువిచారము సదాచారము మహా సిలువే‖ సిలువే ‖
Verse
ఘనమైన రక్షక ధ్యానము మనల ముక్తికి జేర్చువైనము జనకృపాసుధా
పానము దూతగానము తేజోమానము మహా సిలువే‖ సిలువే ‖
Verse
ఇన్ని దినము లూరకుంటిమి యిపుడే రక్షణ కనుగొంటిమి కన్న తండ్రిని
గొల్వకుంటిమి కానకుంటిమి యెరగకుంటిమి మహా సిలువే‖ సిలువే ‖