Verse
సిల్వ చెంత నేసువా
చేర్చి నన్ను నుంచు
కల్వరిన్ స్రవించెడు
కల్వలో నన్నుంచు.
సిల్వకే సిల్వకే‖ సిల్వకే ‖
చెల్లునా విముక్తి
చెల్వ మొప్ప నద్దరిన్
జేర నాకు ముక్తి
Verse
కంపితాత్ము నంధునై
కానలేక యుండ
సొంపు మీరఁ బ్రోచితి
సూర్యతేజ స్కుండ
Verse
దేవ గొఱ్ఱె పిల్ల ఈన
దీప్తి నాకుఁ జూపు
నీ వధా ప్రభావముల్
పావనుండ నేర్పు.
Verse
నే నిరీక్షణంబుతో
నెప్డు వేచి యుందున్
భూ నితాంత వారధిన్
బూని యీది మందున్