Verse
సిల్వయొద్దఁ జేరుదున్
బీద హీనయంధుఁడన్
లోకమున్ త్యజింతును
పూర్ణముక్తి నొందుదున్
కర్త, నిన్నె నమ్ముదున్‖ కర్త ‖
కల్వరీ గొఱ్ఱెపిల్లా
మోకరించి వేఁడెదన్
నన్నుఁ గావుమో ప్రభో!
Verse
నిన్ నేఁజేరఁ గోరఁగా
నన్ను ఁబాయు పాపము
శుద్ధిఁజేతునంచును
యేసు మాటనిచ్చెను.
Verse
నన్ను ను నా మిత్రులన్
లోక యాస్తిఁ గాలమున్
దేహయాత్మయంతయు
నీకర్పింతునిప్పుడు.
Verse
యేసుమాట నమ్మెదన్
క్రీస్తు రక్త పుణ్యముఁ
జూచి మ్రొక్కి యేసుతో
నేను మృతినొందితిన్.
Verse
యేసు తాను వచ్చును
నాకు నిచ్చు పూర్ణతన్
శుద్ధ సౌఖ్య మొందుదున్
జయస్తోత్ర మేసుకు.