Verse
సిరులెల్ల వృధ కాఁగఁ పరికించి నాకున్న గురువముఁ దిరస్కరింతున్
వెర మహిమ రారాజు మరణాద్భుతపు సిలువ నరయుచున్నట్టి వేళన్
ముఖ్యము లైన సిరు లెల్ల‖ సిరు లెల్ల ‖
Verse
ఓ కర్త నా దేవుఁ డౌ క్రీస్తు మృతియందుఁ గాక మరి మురియ
నీయకు ప్రాకట భ్రమకారి వ్యర్ధ వస్తువులను ప్రభుని రక్తంబు కొరకై
త్యజించెదను సిరు లెల్ల‖ సిరు లెల్ల ‖
Verse
చారు మస్తక హస్త పాదములవలన వి చారంబు దయయుఁ గలసి
సారెఁ బ్రవహించుచున్నది చూడు మెపుడిట్టి దారి గలదా ముళ్లు తగు
కిరీటం బౌన సిరు లెల్ల‖ సిరు లెల్ల ‖
Verse
వాని నిజ రక్తంబు వస్త్రంబువలె సిలువ పై నతని తనువు గప్పె
ఐననేనీ లోక మంతటికి మృతుఃడనై తిని నా కీ లోకము మృతంబయ్యె సిరు లెల్ల‖ సిరు లెల్ల ‖