Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Snehamai Praanamai Varinche Daivamai

స్నేహమై ప్రాణమై వరించే దైవమై

Snehamai Praanamai Varinche Daivamai

Lyricist: Joshua Shaik
Chorus
స్నేహమై, ప్రాణమై వరించే దైవమై
ఇదే జీవితం, నీకే అంకితం
ఇదే నా వరం, నీవే అమృతం
నిరంతరం సేవించనీ
Verse
జగతిన వెలసి, మనసున నిలచి
కోరె నన్ను దైవము
లోకమందు జీవమాయె – చీకటందు దీపమాయె
పలకరించే నేస్తమాయె – కనికరించే బంధమాయె
ఎంత ప్రేమ యేసయా – నన్ను నీలో జీవించనీ
Verse
తలపున కొలువై – మనవుల బదులై
చేరె నన్ను నిరతము
కలతలన్నీ కరిగిపోయే – భారమంతా తొలగిపోయే
ఆపదందు క్షేమమాయె – తరిగిపోని భాగ్యమాయే
ఎంత ప్రేమ యేసయా – నన్ను నీలో తరియించనీ
Chorus
స్నేహమై, ప్రాణమై వరించే దైవమై
ఇదే జీవితం, నీకే అంకితం
ఇదే నా వరం, నీవే అమృతం
నిరంతరం సేవించనీ

Related Tags

WorshipThanksgivingDevotional