Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Snehithuda Na Hithuda

స్నేహితుడా నా హితుడా

Snehithuda Na Hithuda

Verse
స్నేహితుడా నా హితుడా
నన్ను విడువని బహు ప్రియుడా
నన్ను మరువని నా హితుడా
ఏమని నిన్ను వర్ణింతును నీ ప్రేమకు నేను ఏమిత్తును
Verse
కారుచున్న కన్నీరు తుడచి
పగిలియున్న గుండెను ఓదార్చి
ఆదరించిన స్నేహితుడా
ననోదార్చిన నా హితుడా
Verse
మోడుగున్న బ్రతుకును చిగురించి
గూడు చెదరిన నన్ను దరిచేర్చి
కృపను చూపిన స్నేహితుడా
కనికరించిన నా హితుడా
నన్ను కరుణించిన నా హితుడా

Related Tags

GraceComfortFriendship