Verse 1
స్నేహితుడు ప్రాణ ప్రియుడు – ఇతడే నా ప్రియ స్నేహితుడు‖ 2x ‖
నా సమీప బందువుడు – దీన పాపి బాందవుడు‖ 2x ‖
వినుమ క్రైస్తవమ – వినుమ యువతరమ
Verse
తోడు నీడ లేని నన్ను చూడ వచ్చెను – జాడలు వెతికి జాలి చూపెను‖ 2x ‖
పాడైన బ్రతుకును బాగుచేసెను – ఎండిన మోడులే చిగురించెను‖ 2x వినుమ ‖
Verse
బాధలలో నన్ను ఆధారించెను – శోధనలందు తోడు నిలిచెను‖ 2x ‖
నా మొరలన్ని ఆలకించెను – నా భారమంతయు తొలగించెను‖ 2x వినుమ ‖