Verse
సోదరులారా లెండి - రాకడ గుర్తులు చూడండి
దివిటీల నూనెతో నింపి - సిద్ధపడండి
Verse
అర్ధరాత్రివేళలో - ప్రభురాకడ ధ్వని మ్రోగెను
సోమరితనము విడచి‖ 2x ‖
నడుమున దట్టి గట్టి - ప్రభుని కెదురుచూడుము
Verse
సర్వత్రయుద్ధాలు భూకం-పములును ఘోరవ్యాధులు
ఘోరముగ ప్రబలెను‖ 2x ‖
యేసుని రాకడ సమీపం - బాయెనో సోదరా
Verse
రాజ్యాలు అధికారాలన్ని - కదలిపోవుచున్నవి
కలవర మధికంబాయె‖ 2x ‖
కన్నులు తెరచి చూడుమా ప్రభు వచ్చేవేళాయె
Verse
చెదరిన యూదులు స్వదేశానికి చేరుటే యొక సూచన
క్రీస్తుయుగ మారంభము‖ 2x ‖
రానై యున్న వేళిదే - కనిపెట్టుము సోదరా
Verse
తలుపు వేయబడిన లోన - ప్రవేశించనేరవు
పశ్చాత్తాప పడుము‖ 2x ‖
యేసుపై నాధారపడి సంసిద్ధపడుమా