Chorus
సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు - యేసుని
Verse
యేసుని రాజ్యము - సమయము వచ్చెను
రక్షణను పొందెదవు - నీవు విశ్వసించిన
Verse
మనుజరూపము ధరించి - స్వర్గము దిగి వచ్చెను
తనదు రక్తముద్వారానే - పాపబంధము త్రుంచెను
Verse
కలువరిలోని సిలువలో - ప్రాణము నర్పించెను
ఎల్లరి పాపములకై - తనదు రక్తము కార్చెను
Verse
సమయము లేదు సోదరా - త్వరపడి రమ్ము వేగమే
సువార్తను విశ్వసించి - రక్షణను పొందుము
Verse
పాప సాగరమునందు ఎంతకాలముందువు?
పాపసాగరమునుండి - యేసుప్రభు విడిపించును