Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Solipoyina Manasaa Neevu

సోలిపోయిన మనసా నీవు

Solipoyina Manasaa Neevu

Verse 1
సోలిపోయిన మనసా నీవు
సేదదీర్చుకో యేసుని ఒడిలో
కలత ఏలనో కన్నీరు ఏలనో
కర్త యేసే నీతో ఉండగా
ప్రభువు నీ చేయి వీడడు ఎన్నడు‖ 2x ‖
యేసులో నీ కోరిక తీరునుగా‖ సోలిపోయిన ‖
యేసు ప్రేమను నీవెరుగుటచే
దూరమైన నీ వారే‖ 2x ‖
కన్న తల్లే నిను మరచిననూ
యేసు నిన్ను మరువడెన్నడు‖ 2x ‖
శ్రమకు ఫలితం కానలేక
సొమ్మసిల్లితివా మనసా‖ 2x ‖
కోత కాలపు ఆనందమును
నీకొసగును కోతకు ప్రభువు‖ 2x ‖
ఎంత కాలము కృంగిపోదువు
నీ శ్రమలనే తలచుచు మనసా‖ 2x ‖
శ్రమపడుచున్న ఈ లోకమునకు
క్రీస్తు నిరీక్షణ నీవై యుండగ‖ 2x ‖
సోలిపోకుము ఓ ప్రియ మనసా
సాగిపో ఇక యేసుని బాటలో
కలత వీడు ఆనందించు
కర్త యేసే నీతో ఉండగా
కలతకు ఇక చావే లేదు‖ 2x ‖
యేసు కోరికనే నెరవేర్చు‖ సోలిపోకుము ‖

Related Tags

ComfortEncouragementHope