Verse
సొంతమైపోవాలి నా యేసుతో
మిళితమై పోవాలి నా ప్రియునితో‖ 2x ‖
సొంతమై మిళితమై యేసుతో ఏకమై‖ 2x ‖
ఎగిరి వెళ్లి పోవాలి నా రాజుతో
లీనమై పోవాలి ఆ ప్రేమలో‖ 2x ‖
Verse
నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి
నా వరుడు కలువరిలో బలియాయెను‖ 2x ‖
బలి అయిన వానికే నా జీవితం
అర్పించుకొనుటే నా ధర్మము‖ 2x ‖
ధర్మము.. ధర్మము.. యేసుతో జీవితం‖ 2x సొంతమై ‖
Verse
పరదేశిగా నేను వచ్చానిలా
తన ప్రేమ కీర్తిని చాటాలని‖ 2x ‖
ప్రియుని కోసమే బ్రతికెదను
కాపాడుకొందును సౌశీల్యము
ప్రభువు కోసమే బ్రతికెదను
కాపాడుకొందును నా సాక్ష్యము
యేసుతో జీవితం పరమున శాశ్వతం‖ 2x సొంతమై ‖