Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sonthamaipovali Naayesuku Milithamaipovali Naa Priyunitho

సొంతమైపోవాలి నాయేసుకు మిళితమైపోవాలి నా ప్రియునితో

Sonthamaipovali Naayesuku Milithamaipovali Naa Priyunitho

Chorus
సొంతమైపోవాలి నాయేసుకు - మిళితమైపోవాలి నా ప్రియునితో
సొంతమై మిళితమై యేసుతో యేకమై
ఎగిరివెళ్ళిపోవాలి నా రాజుతో - లీనమైపోవాలి ఆ ప్రేమలో
Verse
నా ప్రియుడు నా కొరకు చేతులుచాచి
నా వరుడు కలువరిలో బలిఆయెను
బలియైనవానికే నా జీవితం - అర్పించుకొనుటే నా ధర్మము
ధర్మము మర్మము యేసుతో జీవితం
Verse
పరదేశిగా నేను వచ్చానిలా - తన ప్రేమ కీర్తిని చాటాలని
ప్రియుని (ప్రభువు) కోసమే బ్రతికెదను
కాపాడు కొందును సౌశీల్యము (సాక్ష్యము)
యేసుతో జీవితం పరమున శాశ్వతంకు

Related Tags

DevotionalJesusSurrender