Verse
సూడ సక్కని బాలుడమ్మో
బాలుడు కాడు మన దేవుడమ్మో‖ 2x ‖
కన్య మరియ గర్భమున
ఆ పరిశుద్ధ స్థలమున‖ 2x ‖
మనకై జన్మించాడు
మనలను రక్షించాడు‖ 2x సూడ ‖
Verse
బేత్లెహేము పురమందున – లోక రక్షకుడు పుట్టెను
లోకానికి వెలుగై – మనకు కాపరిగా నిలిచెను‖ 2x ‖
ఆ జ్ఞానములు ప్రధానులు నా ప్రభుని మ్రొక్కెను
ఆ దూతలు గొల్లలు క్రొత్త కీర్తనలు పాడెను‖ 2x ‖
సంతోషించి స్తుతియించి కీర్తించి ఘనపరచి
పరవశించ సాగెను‖ 2x సూడ ‖
Verse
మన చీకటిని తొలగించి – వెలుగుతో నింపెను
మన పాపాన్ని క్షమియించి – పవిత్రులుగా మార్చెను‖ 2x ‖
పరిశుద్ధుడు పరమాత్ముడు మా శాంతి స్వరూపుడు
మహనీయుడు మహోన్నతుడు మా లోక రక్షకుడు‖ 2x ‖
దివి నుండి భువిపైకి దిగి వచ్చి
మానవులను ప్రేమించెను‖ 2x సూడ ‖