Verse
శ్రీమంతుడా శ్రీకరుండ శ్రీ యేసు రాజా
అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా అతికాంక్షనీయుడా
ధవళవర్ణుడా మహోన్నతుడా
పరిశుద్దుడా మృత్యుoజేయుడా
జయము జయము నా యేసునికే
జయము జయము నా రారాజుకే
Verse
ఆదిలో ఉన్నవాడా ఆది సంభూతుడ
విశ్వమంతా వ్యాపించిన సృష్టి కర్తా
సింహాసనాసీనుడా శక్తి సంపన్నుడా
మహిమ నీకే ఘనత నీకే
స్తుతులు నీకే నా యేసయ్య
Verse
కృపాసమృద్ధిగలవాడ ప్రేమామయుడా
బలవంతుడైన పరాక్రముడా శక్తిమంతుడా
దీర్ఘశాంతముగలవాడా సమాధానమిచ్చువాడా
జయ గీతము నీకై పాడెదము
నాట్యము చేసి ఆనందించేదం
Verse
లోకాధిపతి సర్వోన్నతుడా కారణ జన్ముడా
లోకానికి వెలుగైనవాడా తేజోమయుడా
దయాదాక్షిణ్యపూర్ణుడా మహిమాన్వితుడా
ఘనతకు పాత్రుడ నీవయ్యా
గళమెత్తి నిన్ను పొగడెదమయ్య
Verse
స్తుతులపై ఆశీనుడా స్తుతులకు పాత్రుడా
మేఘారుడై వచ్చుచున్నవాడ మహిమ స్వరూపుడా
వేవేల దూతల సమూహము నిను కీర్తించి కొనియాడుచుంటిరి
పరిశుద్ధుడు పరిశుద్ధుడని మా స్వరములతో నిను కీర్తించేధం