Verse
శ్రీ యేసు నీదు నామమందు అర్పించిన మా విన్నపం
ఆలకించి ఆశీర్వదించుమా అందుకొనుము మా వందనం
Verse
నీ నామమందు ప్రార్ధించి పొందినాము గొప్ప రక్షణ
రక్షింపబడిన హృదయమందు ముద్రించినావు ఆత్మను
బలపరచుము బలముతో నింపు నీతితో నీవు నన్ను నిరతంబు
Verse
విశ్వాససహితమైన ప్రార్ధన విజయమిచ్చునన్నావయా
తండ్రి సముఖమునకు చేర ప్రార్ధన నీ నామముంచినావయా
బలపరచుము బలముతో నింపు నీతితో నీవు నన్ను నిరతంబు
Verse
పాపంబు స్వార్ధంబు లేక మొర్రపెట్టనేర్పినావయా
సందేహపడక విధేయతతో ప్రార్ధింపజూపినావయా
బలపరచుము బలముతో నింపు నీతితో నీవు నన్ను నిరతంబు