Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sri Yesundu Janminche Reyilo

శ్రీ యేసుండు జన్మించె రేయిలో

Sri Yesundu Janminche Reyilo

Verse
శ్రీ యేసుండు జన్మించె రేయిలో‖ 2x ‖
నేడు పాయక బెత్లెహేము ఊరిలో‖ 2x శ్రీ యేసుండు ‖
Verse
ఆ కన్నియ మరియమ్మ గర్భమందున‖ 2x ‖
ఇమ్మానుయేలనెడి నామమందున‖ 2x శ్రీ యేసుండు ‖
Verse
సత్రమందున పశువులశాల యందున‖ 2x ‖
దేవపుత్రుండు మనుజుండాయెనందునా‖ 2x శ్రీ యేసుండు ‖
Verse
పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి‖ 2x ‖
పశుల తొట్టిలో పరుండ బెట్టబడి‖ 2x శ్రీ యేసుండు ‖
Verse
గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా‖ 2x ‖
దెల్పె గొప్ప వార్త దూత చల్లగా‖ 2x శ్రీ యేసుండు ‖
Verse
మన కొరకొక్క శిశువు పుట్టెను‖ 2x ‖
ధరను మన దోషములబోగొట్టెను‖ 2x శ్రీ యేసుండు ‖
Verse
పరలోకపు సైన్యంబు గూడెను‖ 2x ‖
మింట వర రక్షకుని గూర్చి పాడెను‖ 2x శ్రీ యేసుండు ‖
Verse
అక్షయుండగు యేసు పుట్టెను‖ 2x ‖
మనకు రక్షణంబు సిద్ధపరచెను‖ 2x శ్రీ యేసుండు ‖

Related Tags

ChristmasNativity