Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sri Yesundu Janminche Reyilo Na

శ్రీ యేసుండు జన్మించె రేయిలో న

Sri Yesundu Janminche Reyilo Na

Lyricist: Kommu Krupa
Chorus
శ్రీ యేసుండు జన్మించె రేయిలో నేఁడు పాయక బెత్లెహేమ యూరిలో‖ శ్రీ యేసుండు ‖
Verse
కన్నియ మరియమ్మ గర్భమందున ని మ్మాను యేలనెడి నామమందున‖ శ్రీ యేసుండు ‖
Verse
సత్ర మందునఁ బశువుల సాలయందున దేవ పుత్రుండు మనుజుం
డాయెనందున‖ శ్రీ యేసుండు ‖
Verse
పట్టి పొత్తిగుడ్డలతోఁ జుట్టఁబడి పసుల తొట్టిలోఁ బరుండబెట్టఁబడి‖ శ్రీ యేసుండు ‖
Verse
గొల్లలెల్లరు మిగుల భీతిల్లఁగ దెల్పె గొప్ప వార్త దూత చల్లఁగ
శ్రీ యేసుండు‖ శ్రీ యేసుండు ‖
Verse
మన కొఱకొక్క శిశువు పుట్టెను ధరను మన దోషములఁ బోఁగొట్టను‖ శ్రీ యేసుండు ‖
Verse
పరలోకపు సైన్యంబుఁ గూడెను మింట వర రక్షకుని గూర్చి పాడెను‖ శ్రీ యేసుండు ‖
Verse
అక్షయుండగు యేసు వచ్చెను మనకు రక్షణంబు సిద్ధపర్చెను
శ్రీ యేసుండు‖ శ్రీ యేసుండు ‖

Related Tags

ChristmasNativity