Verse
సృష్టి కర్తా యేసు దేవా
సర్వ లోకం నీ మాట వినును‖ 2x ‖
సర్వ లోక నాథా సకలం నీవేగా
సర్వ లోక రాజా సర్వము నీవేగా
సన్నుతింతును అను నిత్యము‖ సృష్టి ‖
Verse
కానాన్ వివాహములో అద్భుతముగా
నీటిని ద్రాక్షా రసము చేసి
కనలేని అంధులకు చూపు నొసగి
చెవిటి మూగల బాగు పరచితివి
నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో
ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు‖ సర్వ ‖
Verse
మృతుల సహితము జీవింపజేసి
మృతిని గెలిచి తిరిగి లేచితివి
నీ రాజ్యములో నీతో వసింప
కొనిపోవ త్వరలో రానుంటివే
నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో
ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు‖ సర్వ ‖