Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Srushti Karthavaina Yehova

సృష్టి కర్తవైన యెహోవా

Srushti Karthavaina Yehova

Lyricist: Bro Yesanna
Chorus
సృష్టి కర్తవైన యెహోవా
నీ చేతి పనియైన నాపై ఎందుకింత ప్రేమ
మంటికి రూపమిచ్చినావు - మహిమలో స్థానమిచ్చినావు
నాలో నిన్ను చూశావు - నీలో నన్ను దాచావు
నిస్వార్ధమైన నీ ప్రేమ - మరణము కంటె బలమైనది నీ ప్రేమ
Verse
ఏ కాంతి లేని నిశీధిలో - ఏ తోడు లేని విషాదపు వీధులలో
ఎన్నో అపాయపు అంచులలో - నన్నాదుకున్న నా కన్నతండ్రివి
యేసయ్యా నను అనాధగ విడువక
నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి‖ సృష్టి ‖
Verse
నిస్సారమైన నా జీవితములో - నిట్టూర్పులే నను దినమెల్ల వేదించగా
నశించిపోతున్న నన్ను వెదికి వచ్చి - నన్నాకర్షించిన ప్రేమ మూర్తివి
యేసయ్యా నను కృపతో బలపరచి
ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి‖ సృష్టి ‖

Related Tags

GraceLoveCreation