Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Srushtipitha Sarvonnatha Samarpantha

సృష్టిపితా సర్వోన్నతా సమర్పింత

Srushtipitha Sarvonnatha Samarpantha

Lyricist: డి వి డానియల్
Verse 1
సృష్టిపితా సర్వోన్నతా సమర్పింతున్ సర్వస్వమున్
Verse
భూమి ఆకాశము నీవే భూధర శిఖరములు నీవే భూ ప్రజలు నీవారే
బలశౌర్యములు నీవే‖ సృష్టి ‖
Verse
మా వెండి బంగారములు నీవే మాకున్న వరములు నీవే మా దేహముల్
మా గేహముల్ మా జీవితము నీవే‖ సృష్టి ‖
Verse
వెలలేని గాలి వెలుతురులు విలువైన పాడి పైరులు వివిధంబులైన
దీవెనలు నీ కరుణా వర్షములు‖ సృష్టి ‖
Verse
పరిశుద్ధ గ్రంథపు పలుకులు పాలోక తేనె చినుకులు ప్రభు యేసుని
మాటలు మా వెల్గు బాటలు‖ సృష్టి ‖
Verse
మాదంత నీదే మహా దేవా మా రాజువయ్యా యెహోవా మా తనువుల్
మా బ్రతుకుల్ మా యావదాస్తి నీవే‖ సృష్టి ‖
Verse
మేమిచ్చు కాన్క యేపాటిది? యే ప్రేమ నీకు సాటిది? మోక్ష నాధా
యేసుప్రభో అంగీకరించువిభో‖ సృష్టి ‖
Verse
తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవ స్తోత్రముల్ దాత వీవే నేతవీవే
దేవాది దేవుండవే‖ సృష్టి ‖

Related Tags

WorshipDedicationCreation