Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Srustikartha Yesuni Sthuthinchedamu Sarvasrustiyu Prabhu Kriyale

సృష్టికర్త యేసుని స్తుతించెదము సర్వసృష్టియు ప్రభు క్రియలే

Srustikartha Yesuni Sthuthinchedamu Sarvasrustiyu Prabhu Kriyale

Chorus
పల్లవి: సృష్టికర్త యేసుని స్తుతించెదము సర్వసృష్టియు ప్రభు క్రియలే
సర్వ జనాలి సునాదముతో ప్రభుని క్రియలు ఘనపరచెదము
హ... హ.. హ... హ.. హల్లెలూయా...‖ 3x ‖
హల్లెలూ... యా పాడెదము
Verse
అగాధజలములపై ఆత్మ అలల ఊయల ఊగిన వేల
చీకటిని విడదీసి శూన్యమును వెలిగించి
నీదు మహిమను చూపితివే‖ సృష్టి ‖
Verse
అంతరిక్షమున జ్యోతులను అభినవ లోకము విరసిన వేళ
ప్రాణులను సృజియించి ప్రకృతిని యింపుగను
రూపించిన నిను పొగడెదను‖ సృష్టి ‖
Verse
భూఆవిరిని రప్పించి ఆరిన నేలను తడిపిన వేళ
మంటి నుండి మము చేసి నాసికలో జీవమూది
మనిషికి రూపము నిచ్చితివే‖ సృష్టి ‖

Related Tags

PraiseWorshipCreation