Verse
శృతిచేసి నే పాడనా స్తోత్రగీతం
భజియించి నే పొగడనా స్వామి
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
Verse
దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా‖ 2x ‖
జల ప్రళయంలో నోవాను కాచిన
బలవంతుడవు నీవేకదా నీవేకదా నీవేకదా
Verse
సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సుచరితుడవు నీవే కదా‖ 2x ‖
పాపుల కొరకై ప్రాణము నిచ్చిన
కరుణామయుడవు నీవేకదా నీవే కదా నీవే కదా