Verse
స్థిరపరచువాడవు బలపరచువాడవు
పడిపోయిన చోటే నిలబట్టువాడవు
ఘనపరచువాడవు హెచ్చించువాడవు
మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు‖ 2x ‖
Verse
ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు
నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు‖ 2x ‖
యేసయ్య.. యేసయ్య .. నీకే నీకే సాధ్యము‖ 2x ‖
Verse
సర్వకృపానిధి మా పరమ కుమ్మరి
నీ చేతిలోనే మా జీవమున్నది‖ 2x ‖
మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి
మా ఊహకు మించిన కార్యములెన్నో
జరిగించుచున్నవి‖ 2x ఏమైనా ‖
Verse
నీ ఆజ్ఞ లేనిదే ఏదైన జరుగునా?
నీ కంచే దాటగ శత్రువుకు సాధ్యమా?‖ 2x ‖
మా దేవా నీవే మాతొడుంటే అంతే చాలును
అపవాది తలచిన కీడులన్నీ
మేలైపోవును‖ 2x ఏమైనా ‖