Verse
స్తోత్ర గీతములను పాడుచు - ప్రియ ప్రభుని పూజించుడి
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ
స్తోత్ర గీతములను పాడుచు - ప్రియ ప్రభుని పూజించుడి
Verse
రారండి సంతసించుచు - రారాజును కీర్తించను
రాజులకు రాజని - ప్రభువులకు ప్రభువని
రమ్యమైన రాజును స్తుతించెదం
Verse
సిలువలో బలియాయెను - విలువైన రక్తము కార్చెను
ఎంత శ్రమనొందెను - ఎంత బాధ నోర్చెను
తన రక్తముతో మనల కొనెగదా
Verse
విందు శాలకు తెచ్చెను - ప్రేమ ధ్వజము పైకెత్తెను
వింత సుందరుడని - వేలలో శ్రేష్ఠుడని
ఎంతైన జేయు సామర్థ్యుడని
Verse
మన ఆత్మ ప్రాణ - దేహముల్ - సజీవముగ నర్పింతుము
అత్తరును పూసిన - మరియ వలె మనమును
పరిమళంబులన్ ప్యాపింప జేయుదం
Verse
ప్రశంసించె ప్రభువు మరియను - మంచి కార్యము చేసెనని
ప్రభువు కొరకు చేయుము - ప్రాణము నర్పించుము
ప్రభువే సర్వము మనకు
Verse
మరణమున్ తానే గెల్చెను - సైతానును ఓడించెను
మరణమున్ మ్రింగెను - మరణముల్లు విరిచెను
జయము జయమటంచు ఆర్భటించెదం
Verse
ఆర్భాటముగా ప్రభువు - మేఘారూఢుడై వచ్చును
నిశ్చయముగా మనలను కొనిపోవు వేగమే
మహిమ దేహములను పొంది యుందుము