Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthothra geethamulu yehovaaku paadedham

స్తోత్రగీతములు యెహోవాకు పాడెదం

Sthothra geethamulu yehovaaku paadedham

Lyricist: Jeevan Wesley Olesu
Verse
స్తోత్రగీతములు యెహోవాకు పాడెదం
సంగీత స్వరములతో గానము చేసెదం
గళమెత్తి పాడెదం యేసు నామమును హెచ్చించెదం
స్తుతియాగము అర్పించెదం
సర్వోన్నతుని సన్నుతించెదం
Chorus
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
Verse
వంకర మార్గమును – తిన్నగా చేసెను
పాడైన బ్రతుకులను సరిచేసి నిలిపెను
మన దీనస్థితిని మార్చివేసెను
మన దుఃఖమును తొలగించెను
ప్రేమాస్వరూపుడు – దీర్ఘశాంతుడు
Verse
ఘనమైన కార్యములు – జరిగించియున్నాడు
ఏ కొదువ లేకుండా – నడిపించియున్నాడు
మనలను ఎంతో ప్రేమించెను గొప్ప దీవెనలు కురిపించెను
కరుణస్వరూపుడు – మహోపకారుడు
Verse
స్తుతులపై ఆసీనుడు – యెహోవా దేవుడు
లోక రక్షకుడు మన యేసు నాధుడు
నిండు మనసుతో కొనియాడేదం
మన చేతులెత్తి పూజించేదం
ఆత్మస్వరూపుడు – ఆరాధ్యనీయుడు

Related Tags

PraiseWorship