Verse
స్తోత్రబలి అర్పించెదము
మంచి యేసు మేలు చేసెన్‖ 2x ‖
చేసెను మేలులెన్నో
పాడి పాడి పొగడెదన్‖ 2x ‖
తండ్రీ స్తోత్రం – దేవా స్తోత్రం‖ 2x ‖
Verse
ప్రాణమిచ్చి నను ప్రేమించి
పాపం తొలగించి కడిగితివే‖ 2x ‖
నీ కొరకు బ్రతుక వేరుపరచి
సేవ చేయ కృప ఇచ్చితివే‖ 2x తండ్రీ ‖
Verse
గొప్ప స్వరముతో మొరపెట్టి
సిలువ రక్తమును కార్చితివే‖ 2x ‖
రక్త కోటలో కాచుకొని
శత్రు రాకుండ కాచితివే‖ 2x తండ్రీ ‖
Verse
చూచే కన్నులు ఇచ్చితివి
పాడే పెదవులు ఇచ్చితివి‖ 2x ‖
కష్టించే చేతులు ఇచ్చితివి
పరుగెత్తే కాళ్ళను ఇచ్చితివి‖ 2x తండ్రీ ‖
Verse
మంచి ఇల్లును ఇచ్చావయ్యా
వసతులన్నియు ఇచ్చావయ్యా‖ 2x ‖
కష్టించి పనిచేయ కృప చూపి
అప్పు లేకుండ చేసితివే‖ 2x తండ్రీ ‖