Verse
స్తోత్రబలి స్తోత్రబలి – మంచిదేవా నీకేనయ్యా
శుభవేళ ఆనందమే – నా తండ్రి నీ చిరుపాదమే‖ 2x ‖
Verse
నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే‖ 2x ‖
నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా‖ 2x ‖
కోటి కోటి స్తోత్రం డాడి‖ 3x స్తోత్రబలి ‖
Verse
రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి‖ 2x ‖
మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును‖ 2x ‖
కోటి కోటి స్తోత్రం డాడి‖ 3x స్తోత్రబలి ‖
Verse
నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి‖ 2x ‖
ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి‖ 2x ‖
కోటి కోటి స్తోత్రం డాడి‖ 3x స్తోత్రబలి ‖
Verse
వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు‖ 2x ‖
యేసయ్య నీ నీడలో దినదినం జీవింతును‖ 2x ‖
కోటి కోటి స్తోత్రం డాడి‖ 3x స్తోత్రబలి ‖