Verse
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాథుని మేలులు తలంచి‖ స్తోత్రం ‖
Verse
దివారాత్రములు కంటిపాపవలె కాచి‖ 2x ‖
దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి‖ 2x స్తోత్రం ‖
Verse
గాడాంధకారములో కన్నీటి లోయలలో‖ 2x ‖
కృశించి పోనీయక కృపలతో బలపరచితివి‖ 2x స్తోత్రం ‖
Verse
సజీవ యాగముగా మా శరీరము సమర్పించి‖ 2x ‖
సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి‖ 2x స్తోత్రం ‖
Verse
సీయోను మార్గములో పలుశోధనలు రాగా‖ 2x ‖
సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి‖ 2x స్తోత్రం ‖
Verse
సిలువను మోసుకొని సువార్తను చేపట్టి‖ 2x ‖
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి‖ 2x స్తోత్రం ‖
Verse
పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా‖ 2x ‖
సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా‖ 2x స్తోత్రం ‖