Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthothram Sthothramu Devaadhi Devaa Paathralanugaa Maarchithivi Devuni Paathralanuga

స్తోత్రం స్తోత్రము దేవాది దేవా పాత్రలనుగా మార్చితివి దేవుని పాత్రలనుగ

Sthothram Sthothramu Devaadhi Devaa Paathralanugaa Maarchithivi Devuni Paathralanuga

Verse
స్తోత్రం స్తోత్రము దేవాది - దేవా
పాత్రలనుగా - మార్చితివి దేవుని పాత్రలనుగ
Verse
శుద్ధీకరింప - బడిన పాత్రలు విజ్ఞాపన - చేయునవి
సరిగ పుటము - వేయబడిన తగిన బలము - కలిగినవి
Verse
ఏర్పరచ - బడిన పాత్రలు విజ్ఞాపన - చేయునవి
కదలక - స్థిరముగ నున్నవి ప్రభువును పొందినవి
Verse
ఘనపరచ - బడిన పాత్రలు స్తుతులు - చెల్లించునవి
మరకలేని - కారణమున కొలతలో తగ్గనివి
Verse
ఉపయోగింప - బడెడి పాత్రలు సాక్ష్యము నిచ్చును - భువిలో
లోక - శ్రమకెప్పుడు జడియనివి దాచిన ధనముకలవి
Verse
సత్యముతో - నిండిన పాత్రలు తెల్లని రంగు - కలవి
స్వర్ణమువలె - కాంతి కలవి వెనుకంజ వేయనివి
Verse
కష్టములకు - తగిన పాత్రలు సకలము - సహించునవి
నొక్కినను - వంకరకానివి జయధ్వని - చేయునవి

Related Tags

PraiseWorshipConsecration