Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthothramu Paadi Pogadedhanu Dhaevaadhidhaevaa Ninu Raajaadhiraajaa Ninu

స్తోత్రము పాడి పొగడెదను దేవాదిదేవా నిను రాజాధిరాజా నిను

Sthothramu Paadi Pogadedhanu Dhaevaadhidhaevaa Ninu Raajaadhiraajaa Ninu

Verse 1
Reference: శ్రేష్ఠమైనది ప్రేమయే. 1 కొరింథీ Corinthians 13:13
Chorus
స్తోత్రము పాడి పొగడెదను
దేవాదిదేవా నిను రాజాధిరాజా నిను
మ్రొక్కి కీర్తించెదను
Verse
అద్భుతమైన ప్రేమ - నాలో పరమతండ్రి చూపు శుద్ధ ప్రేమ
ఎన్నడును మారని ప్రేమ - నాలో నిలుచుండు ప్రేమ
Verse
జ్యోతిగా జగమునకు - వచ్చి జీవమిచ్చి నన్నుకొన్న ప్రేమ
త్యాగియైన క్రీస్తు ప్రేమ - దివ్య మధుర ప్రేమ
Verse
మాయలోక ప్రేమను - నమ్మి నశించిన నన్ను ప్రేమించెను
నన్ను జయించిన దైవ ప్రేమ - నాలో ఉప్పొంగు ప్రేమ
Verse
ఆధారమైన ప్రేమ - దినము మాతవలె నన్నాదుకొను ప్రేమ
ఉన్నత మహా దైవ ప్రేమ - నన్నాకర్షించె ప్రేమ
Verse
మాట తప్పని ప్రేమ - పరమ వాక్కు నిచ్చి ఆదరించె ప్రేమ
సర్వ శక్తిగల దైవ ప్రేమ - సతతము నుండు ప్రేమ

Related Tags

PraiseWorshipGod