Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthothramu Seyarae Sodharulaara Mana Ya

స్తోత్రము సేయరే సోదరులార మన యా

Sthothramu Seyarae Sodharulaara Mana Ya

Lyricist: Gollapalli Nathaniel
Chorus
స్తోత్రము సేయరే సోదరులార మన యాత్మలతోఁ దండ్రిన్ ధాత్రిని
మన పర మాత్ముని వాక్కులు స్తోత్రములోఁ గలిపి‖ స్తోత్రము ‖
Verse
ఇచ్చట ప్రేమల కిదియే కడవరి వచ్చియున్న దేమో అచ్చట మన
మం దఱముఁ గలిసికొని యానందింతుముగా‖ స్తోత్రము ‖
Verse
ఎక్కువ ప్రేమలు చక్కని స్తోత్రము లక్కడ మన మంత మిక్కిలి
ప్రియుడు దేవుని కిడుదుము ఒక్క మనసుతోను‖ స్తోత్రము ‖
Verse
కన్నీ రుండదు చావు కష్టము లెన్నటి కుండవుగా కన్నను మన శృం
గారపు బ్రతుకు లెన్నఁదరము గాదె‖ స్తోత్రము ‖
Verse
వాగును వీణెలు సాగును పాటలు సతతముగా నచట రాగము
లెంతో రమ్య మై యుండును బాగింతన లేము‖ స్తోత్రము ‖
Verse
మరల నిచటఁ గూ డుదుమో లేదో మన మందరము త్వరలో మున
పర లోకపు దండ్రి తోడ నుందు మేమో‖ స్తోత్రము ‖
Verse
గొఱ్ఱెపిల్ల రక్తము విలువచ్చుట గొప్పది గాంతుముగా గురుతరమగు
మన దేవుని ప్రేమను కూర్మితో జూతుముగా‖ స్తోత్రము ‖
Verse
పరమ తండ్రితోఁ ప్రభుయేసునితోఁ బరిశుద్ధాత్మునితో
స్థిరముగనుందుము మరి దూతలతోఁ బరలోకమునందున్‖ స్తోత్రము ‖

Related Tags

PraiseWorshipFellowship