Verse
స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈ వేకువనే స్తోత్రము జేతుము మా దేవా
రాత్రియందున మమ్ము రక్షించి గాపాడి ధాత్రి మరియొక
దినమున్ దయతో నిచ్చెన దేవా‖ దేవా ‖
Verse
పాపశోధనలనుండి ప్రభువా మమ్ము కాపాడి బ్రోవుమయ్య ఏ
పాపము మమ్మున్ ఏల నియ్యకుండ మాపు రేపులుమమ్ము మనిపి
బ్రోవుమయ్య‖ దేవా ‖
Verse
కన్న తండ్రికంటెను కనికరమున కాపాడెడి మా దేవా అన్న
దమ్ములవలె మే మందరిని ప్రేమించి మన్ననతో నీదినము మన
నియ్యుమో దేవా‖ దేవా ‖
Verse
పితా సుతా శుద్ధాత్మలనెడి దేవా ప్రీతితో గావుమయ్యా
నీతిమార్గములందు నిరతము మముగాచి ఖ్యాతిగా నీకొరకు బ్రతుకనిమ్మో
దేవా‖ దేవా ‖