Verse
స్తోత్రము స్తోత్రము స్తోత్రము యేసు దేవా
పాత్రుల జేసి నేటివరకు మమ్ము కాచినదేవా
Verse
పొత్తిగుడ్డల చేత చుట్టబడిన తండ్రి
పాపుకై జీవమిడి గొల్లలకు నిజహర్ష మిచ్చితివే
Verse
హేమకిరీటము తెల్లంగినే నే ధరింప
హీనకిరీటము ముండ్లతో పొందిరి - నన్ను రక్షింప
Verse
పాపినై చేసెడు పాపములను తీర్చను
ఏపుగ కల్వరి యందున నాకై పాట్లుపడితివి
Verse
పాప నివారణ బలియగు గొఱ్ఱెపిల్ల
పాపమృతులమౌ మమ్మురక్షింప ప్రాణమిచ్చితివే
Verse
సైతానును జయింప శక్తినిచ్చిన దేవా
బుద్ధితో పోరాడి యుద్ధమున గెల్వ జ్ఞానమీయుము
Verse
ఈలాటి ప్రేమను ఏలాగు తెల్పుదును
జీవమార్గమున చ్క్కగ నడుతు నాయన శక్తిచే
Verse
దూతలు కొనియాడు జ్ఞానుడవగు తండ్రి
దానములిమ్ము దయతోడ నిత్యము దయగల మా తండ్రి