Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthothramu Sthothyamayya Deva Sthothramu Sthothyamayya

స్తోత్రము స్తోత్యమయ్యా దేవా స్తోత్రము స్తోత్యమయ్యా

Sthothramu Sthothyamayya Deva Sthothramu Sthothyamayya

Chorus
స్తోత్రము స్తోత్యమయ్యా దేవా - స్తోత్రము స్తోత్యమయ్యా
Pre-Chorus
నేత్రమువలె గత వత్సరము - మిత్రుడా బ్రోచితివి
స్తోత్రము స్తోత్యమయ్యా
Verse
ఎన్నో గొప్ప కీడులు మాకు - పెన్నుగా కలిగినన్
అన్నియు మా చెంత చేరకుండునట్లు - మన్నాధిపా బ్రోచితి
Verse
పేరాశ పాపంబుల నీవు - ధారాళముగ మన్నించి
ఈ వత్సరమందు పాపమున పడకుండ - నోవత్సా కాపాడుము
Verse
ఆనందారంభంతో నిండు - ఆశతో ప్రేమించి
భూమియందు రక్షకుడుగ జన్మించిన స్వామి నిన్ను కొల్తుము
Verse
ఈ క్రొత్త యేడునందు మా అక్కర మేళ్ళన్నియు
సతతము మాకు దయతోడ తీర్చుమో - వింత యేసు రక్షకా
Verse
గద్దియ జీవితము నీతో ముదముతో సల్పుటకు
నిత్యము యేసును ప్రేమతో వెంబడింప - నన్ను కనికరింపుము
Verse
దేశకీడు తొల్గను - ఇంక - దోషములు వీడను
హోసన్నా ఏకంబుగా పాడుటకు - దాసుల కరుణింపుము
Verse
హల్లెలూయ పాటను నీ ఏట నెక్కువగా పాడన్
దిక్కులవారికి సువార్త ప్రకటింప - గ్రక్కున వరములిమ్ము

Related Tags

PraiseWorshipNew Year