Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthothramu Sthuthi Chellinthumu

స్తోత్రము స్తుతి చెల్లింతుము

Sthothramu Sthuthi Chellinthumu

Verse
స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా
యుగయుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా‖ 2x ‖
నీవే మార్గం నీవే జీవం
నీవే సత్యం నీవే సర్వం‖ 2x స్తోత్రము ‖
Verse
మరణమైననూ ఎర్ర సంద్రమైననూ
నీ తోడు నాకుండ భయము లేదుగా
శత్రు సైన్యమే నా ఎదుట నిలచినా
బలమైన కోట నీవేగా‖ 2x ‖
నా దుర్గమా నా శైలమా
నా అతిశయమా ఆనందమా‖ 2x నీవే ‖
Verse
హింసలైననూ పలు నిందలైననూ
నీ చల్లని రెక్కలే నాకాశ్రయం
చీకటైననూ అగాధమైననూ
నీ క్షమా కిరణమే వెలుగు మార్గము‖ 2x ‖
నీతి సూర్యుడా నా పోషకుడా
నా వైద్యుడా మంచి కాపరి‖ 2x నీవే ‖

Related Tags

PraiseWorshipThanksgiving