Verse
స్తోత్రము యేసునాథా నీకు సదా - స్తోత్రము యేసునాథా
స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము - పిత్రపుత్రాత్మలకు
Verse
నేడు నీదు నామమందున - మేము చేరి స్తుతించునట్లు
చేసిన కృపకై నీకే నిరతము - స్తోత్రము చేసెదము
Verse
నీదు రక్తధారచే కలిగిన - సజీవ నవమార్గము
దాసులము తండ్రి సన్నిధి చేరను - నిత్యము స్వాతంత్ర్యము
Verse
ఇట్టి ప్రభావమైన పదవిని - పురుగులమగు మాకు
ఇంత దయతోడ నిచ్చిన కృపమా - కెంతయు నాశ్చర్యము
Verse
దూతల సైన్యములు శృంగార - గీతముల నెప్పుడు
రాజాధిరాజా నీ స్తుతులు పాడుచు - నార్భటించుచుందురు
Verse
నీవు తఫ్ఫ మాకు పరమందున - వేరెవరు గలరు?
ఇద్దరయందు నీవు తప్ప మాకు ఆదరణ ఎవరు?