Verse
పల్లవి: స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయ
స్తుతి - చెల్లించి యుల్లసింతము హల్లెలూయ
Verse
అను పల్లవి: గడచిన కాలమెల్ల - కంటిపాపవలె
కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయ - ప్రభున్
Verse
పాపమును బాపినాడు హల్లెలూయ - మన
శాపమును మాపినాడు హల్లెలూయ
కన్నతల్లివలెనె - కనికరించెను మమ్ము
యెన్నతరమా ప్రేమ హల్లెలూయ - ప్రభున్
Verse
తల్లియైన మరచినను హల్లెలూయ - తాను
ఎన్నడైన మరచిపోడు హల్లెలూయ
ఎల్ల యీవుల నిచ్చి యులాస మొసగును
కొల్లగ మనల కోరి హల్లెలూయ - ప్రభున్
Verse
శోధన కాలములందు హల్లెలూయ - మన
మేధన కాలములందు హల్లెలూయ
నాథుడు యేసు మన చెంతనుండ నిల
చింత లేమియు రావు హల్లెలూయ - ప్రభున్
Verse
ఘోర తుఫాను లెన్నెన్నో హల్లెలూయ - బహు
ఘోరముగ లేచినను హల్లెలూయ
దోనెయందున్న యేసు - దివ్యముగను లేచి
ధాటిగా వాటి నణచు హల్లెలూయ ప్రభున్
Verse
సర్వలోకమునందున హల్లెలూయ - నన్ను
సాక్షిగ నించెను యేసు హల్లెలూయ
చేరిన వారినెల్ల కోరి ప్రేమించు నేసు
చేర్చును కౌగిటిలో హల్లెలూయ ప్రభున్