Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthothrinchedamu

స్తోత్రించెదము

Sthothrinchedamu

Lyricist: Songs Of Zion
Verse
స్తోత్రించెదము దైవకుమారుని – నూతన జీవముతో‖ 2x ‖
నిరంతరము మారని రాజును – ఘనంబు చేయుదము‖ 2x ‖
Verse
యేసు మా రక్షకుడు – కల్మషము లేనివాడు‖ 2x ‖
సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ‖ 2x ‖
Verse
భయంకరమైన భీతిని గొల్పెడు – జిగట ఊబినుండి‖ 2x ‖
బలమైన హస్తముతో నన్ను ఎత్తి – బండపై స్థిరపరచెన్‖ 2x యేసు ‖
Verse
కనుపాపగ నను కాయు ప్రభుండు – కునుకడు నిద్రించడు‖ 2x ‖
తనచేతిలో ననుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము‖ 2x యేసు ‖
Verse
తల్లిదండ్రియు యెడబాసినను – విడువక కాయును‖ 2x ‖
ఎల్లప్పుడు నేను భజియించెదను – వల్లభుడేసు ప్రభున్‖ 2x యేసు ‖
Verse
ఆత్మీయ పోరాటమునకు ప్రభువు – ఆత్మశక్తినిచ్చెన్‖ 2x ‖
స్తుతియు నీకే ఘనతయు నీకే – యుగయుగములలోన‖ 2x యేసు ‖

Related Tags

PraiseWorshipJesus