Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthothrinthumu Ninu Maadu Thandri

స్తోత్రింతుము నిను మాదు తండ్రి

Sthothrinthumu Ninu Maadu Thandri

Verse
స్తోత్రింతుము నిను మాదు తండ్రి
సత్యముతో ఆత్మతో నెప్పుడు‖ 2x ‖
పరిశుధ్ధాలంకారములతో
దర్శించెదము శరణం శరణం‖ 2x స్తోత్రింతుము ‖
Verse
శ్రేష్ఠ యీవుల యూట నీవే
శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున‖ 2x ‖
త్రిత్వమై ఏకత్వమైన త్రి-
లోకనాథ శరణం శరణం‖ 2x స్తోత్రింతుము ‖
Verse
దవలవర్ణుడ రత్నవర్ణుడ
సత్యరూపి యనబడువాడా‖ 2x ‖
నను రక్షించిన రక్షకుండవు
నాథ నీవే శరణం శరణం‖ 2x స్తోత్రింతుము ‖
Verse
సంఘమునకు శిరస్సు నీవే
రాజా నీకే నమస్కారములు‖ 2x ‖
ముఖ్యమైన మూలరాయి
కోట్లకొలది శరణం శరణం‖ 2x స్తోత్రింతుము ‖
Verse
నీదు సేవకుల పునాది
జ్ఞానమునకు మించిన తెలివి‖ 2x ‖
అందముగనూ కూడుకొనుచు
వేడుకొందుము శరణం శరణం‖ 2x స్తోత్రింతుము ‖
Verse
రాజ నీకే స్తుతి స్తోత్రములు
గీతములు మంగళ ధ్వనులు‖ 2x ‖
శుభము శుభము శుభము నిత్యం
హల్లెలూయా ఆమెన్ ఆమెన్‖ 2x స్తోత్రింతుము ‖

Related Tags

PraiseWorshipTrinity