Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthi Gaaname Paadanaa

స్తుతి గానమే పాడనా

Sthuthi Gaaname Paadanaa

Verse
స్తుతి గానమే పాడనా
జయగీతమే పాడనా‖ 2x ‖
నా ఆధారమైయున్న
యేసయ్యా నీకు – కృతజ్ఞుడనై
జీవితమంతయు సాక్షినై యుందును‖ 2x స్తుతి ‖
Verse
నమ్మదగినవి నీ న్యాయ విధులు
మేలిమి బంగారు కంటే – ఎంతో కోరతగినవి‖ 2x ‖
నీ ధర్మాసనము – నా హృదయములో
స్థాపించబడియున్నది – పరిశుద్ధాత్మునిచే‖ 2x స్తుతి ‖
Verse
శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు
లౌకిక జ్ఞానము కంటే – ఎంతో ఉపయుక్తమైనవి‖ 2x ‖
నీ శ్రేష్టమైన – పరిచర్యలకై
కృపావరములతో నను – అలంకరించితివే‖ 2x స్తుతి ‖
Verse
నూతనమైనది నీ జీవ మార్గము
విశాల మార్గము కంటే – ఎంతో ఆశించదగినది‖ 2x ‖
నీ సింహాసనము – నను చేర్చుటకై
నాతో నీవుంటివే – నా గురి నీవైతివే‖ 2x స్తుతి ‖

Related Tags

PraiseWorshipThanksgiving