Verse
స్తుతి మధుర గీతము – వేలాది స్తోత్రము
చెల్లించుటే నా ధన్యత
బహు గొప్ప స్థానము – శ్రీ యేసు పాదము
చేరడమే నా ఆతృత
అన్నీ తలాంతులు నీ కొరకే వాడెద
నూరంత ఫలములను నూరేళ్లు ఇచ్చెద‖ స్తుతి ‖
Verse
కనులకే కనపడలేని నా కంటి పాపవై
కాళ్ళకే తెలియక నన్ను చేర్చేవు గమ్యము‖ 2x ‖
నాకే తెలియక నాలో
నీవు నాదు ప్రాణ శ్వాసవై
నడిపించావా దేవా ఇన్నాళ్లుగా‖ స్తుతి ‖
Verse
అణువణువు నీ కృప చేత నిండుగా నను నింపి
నీలాంటి పోలిక కలుగ శరీరం పంచితివి‖ 2x ‖
రాతి గుండెను దిద్ది
గుడిగా మార్చుకున్న దైవమా
ముల్లును రెమ్మగా మార్చితివి‖ స్తుతి ‖